MLA: తాగునీటి సమస్య రానీయకండి
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:10 AM
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చ ర్యలు తీసుకోవాలని ఆ యాశాఖల ఇంజనీర్లు, అధికారులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో గురువారం సాయంత్రం గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఎంపీడీవోలు, మున్సిపల్, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
- అధికారులకు ఎమ్మెల్యే కాలవ ఆదేశం
రాయదుర్గం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చ ర్యలు తీసుకోవాలని ఆ యాశాఖల ఇంజనీర్లు, అధికారులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో గురువారం సాయంత్రం గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఎంపీడీవోలు, మున్సిపల్, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముందస్తు ప్రణాళికతో మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన చోట్ల ముందే మరమ్మతులు, కొత్తబోర్ల ఏర్పాటు, మోటార్ల కొనుగోలుకు రూ.93 లక్షలు అవసరం అవుతందని అధికారులు ప్రతిపాదించారు. రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో మరో రూ.55 లక్షలు అవసరమని నివేదించారు. నిర్వహణకు నిధులు ఎంతమేర అవసరమో అంచనా వేసి, నివేదిక సమర్పించాలన్నారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, డీఈ సురేష్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ రామారావు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....