DOGS : ప్రభుత్వాస్పత్రిలో శునకాల సంచారం
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:24 AM
పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో శునకాలు సంచరిస్తున్న దృశ్యం ప్రతి రోజూ కనిపిస్తోం ది. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహా యకుల మధ్య శునకాలు తిరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రో గుల కోసం ఏర్పాటు చేసిన గదుల్లోనే వాటి సందచార దృశ్యాలు కనిపిం చడం ఆస్పత్రి నిర్వహణపై పలు ప్రశ్నలకు తావిస్తోంది
కళ్యాణదుర్గం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో శునకాలు సంచరిస్తున్న దృశ్యం ప్రతి రోజూ కనిపిస్తోం ది. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహా యకుల మధ్య శునకాలు తిరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రో గుల కోసం ఏర్పాటు చేసిన గదుల్లోనే వాటి సందచార దృశ్యాలు కనిపిం చడం ఆస్పత్రి నిర్వహణపై పలు ప్రశ్నలకు తావిస్తోంది. ప్రభుత్వాస్ప త్రికి ప్రతి రోజు పరిసర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పేద, సామాన్య ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. ఇలాంటి చోట శునకాలు స్వే చ్ఛగా సంచరిస్తే రోగులు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు భయాందోళనకు గురయ్యే అవకాశం వుందని పలువురు పేర్కొంటున్నారు. ఆస్పత్రి ఆవరణలో శునకాలు సంచరించే పరిస్థితి నెలకొనడం పట్ల పారిశుధ్య సిబ్బంది పని తీరు, ఆస్పత్రి నిర్వహణ తీరుపై ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. రోగుల ఫిర్యాదులను పట్టించుకోవడం, ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు, సిబ్బంది అందు బాటులో ఉండడం, పారిశుధ్యం తదితర అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం వుంది. రోగులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్పత్రి ప్రాంగణంలో శునకాలు సంచరించకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. ఆస్పత్రి వైద్యా ధికారి, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని పరిశీ లించి రోగులకు ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రోగుల కోసం ఏర్పాటు చేసిన గదుల్లోనే శున కాలు సంచరించే పరిస్థితిని అరికట్టేందుకు తగు భద్రతా చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రిలో పారిశుధ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....