MLA: తాగునీటి శుభ్రతపై అనుమానాలు వద్దు
ABN , Publish Date - May 14 , 2026 | 11:53 PM
తాగునీటి శుభ్రతపై ఎటు వంటి అనుమానాలు వద్దని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచిం చారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో చేపలు పట్టడానికి, ఇతర కార్యక్ర మాల కోసం ఎవరైనా వస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఆయన గురువారం సాయంత్రం పట్టణ శివారులోని మునిసిపల్ ఎస్‌ఎస్ ట్యాం కులను పరిశీలించారు.
-ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
గుంతకల్లు, మే 14 (ఆంధ్రజ్యోతి): తాగునీటి శుభ్రతపై ఎటు వంటి అనుమానాలు వద్దని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచిం చారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో చేపలు పట్టడానికి, ఇతర కార్యక్ర మాల కోసం ఎవరైనా వస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఆయన గురువారం సాయంత్రం పట్టణ శివారులోని మునిసిపల్ ఎస్‌ఎస్ ట్యాం కులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత ఎస్‌ఎస్ ట్యాంకులో ఓ వ్యక్తి పడి చనిపోయాడని, కానీ ఆ ట్యాంకులో నీటి మట్టం తగ్గిపోయిన కారణంగా అందులోంచి నీటిని సరఫరా చేయ డం లేదన్నారు. సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టుల వల్ల ప్రజ లు ఆందోళన చెందుతున్నారన్నారు. అయితే ప్రస్తుతం కొత్త ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి సక్రమంగా ఫిల్టర్ చేసి, క్లోరినేషన చేసిన నీటిని పట్టణానికి సరఫరా చేస్తున్నామన్నారు. ఎస్‌ఎస్ ట్యాంకులకు ఏడు కి.మీ.ల మేర ఫెన్సింగ్‌ను ఏర్పాటుకు రూ. మూడు కోట్లు అవుతుందని,
నిధులను సమకూర్చాలని కలెక్టర్‌ను ఫోనులో కోరినట్లు తెలిపారు. తాగునీటి పరిశుభ్రత విషయంగా రాజీపడవద్దని మునిసిపల్ కమిషనరు లక్ష్మీదేవి, ఎంఈఈ ఇంతియాజ్ ఆలీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, ఆమ్లెట్ మస్తాన యాదవ్, పాల మల్లికార్జున, హనుమంతు, రామన్న చౌదరి, ఫజులు, ఆటో ఖాజా, కదిరప్ప, అంజి, యుగంధర్, వీరేశ కుమార్, రాయల్ వెంకటేశులు, శివన్న తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్ ట్యాంక్ వద్ద కంప చెట్ల తొలగింపు
పట్టణానికి నీరు సరఫరా చేసే ఎస్‌ఎస్ ట్యాంక్ వద్ద ఏపుగా పెరిగిన కంపచెట్లను మున్సిపల్ అధికారులు గురువారం ఎక్స్‌కవేటర్‌తో తొలగి స్తు న్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పేర్కొన్నారు. ట్యాంక్ వద్ద కంప చెట్ల తొలగింపు పనులను కమిషనర్ పరిశీలించారు. ఎస్‌ఎస్ ట్యాంక్ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి బాతులు పట్టడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారుల అనుమతులు లేకుండా ఎస్‌ఎస్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో కనబడితే కఠిన చర్యలు తీసుకుం టామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ ఇంతియాజ్, డీఈ రవిప్రకాష్ నాయుడు, ఏఈ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....