Share News

త్వరగా పూర్తి చేయండి

ABN , Publish Date - May 07 , 2026 | 11:41 PM

శ్మశాన వాటిక రూపురేఖలు మారుద్దామని, పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శ్మశాన వాటికను గురు వారం ఆయన పరిశీలించారు.

త్వరగా పూర్తి చేయండి

-జేసీపీఆర్‌ -శ్మశాన వాటిక పనుల పరిశీలన

తాడిపత్రి, మే7(ఆంధ్రజ్యోతి): శ్మశాన వాటిక రూపురేఖలు మారుద్దామని, పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శ్మశాన వాటికను గురు వారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ శ్మశాన వాటికలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇ క్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని సూచించారు. శ్మశానం అనే భావన ఎవరికీ కనిపించరాదన్నారు. రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు నాటి గ్రీనరీగా చేయాలని సూచించారు. శ్మశాన వాటికలో చేస్తున్న సిమెంట్‌రోడ్డు పనులను పరిశీలించి, త్వరగా పూర్తిచేయాల ని కాంట్రాక్టర్‌ హరినాథ్‌రెడ్డికి సూచించారు. త్వరలో కొత్త హంగులతో ఆధునాతమైన హిందూ శ్మశాన వాటిక ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఆయన వెంట సీనియర్‌ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - May 08 , 2026 | 07:52 AM