SEEEDS: ఉచిత కంది విత్తనాల పంపిణీ
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:50 PM
రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కళ్యాణదు ర్గం మార్కెట్ యార్డు చైర్మన లక్ష్మీదేవి రమేష్ పేర్కొ న్నారు. స్థానికం గా సోమవారం నిర్వహించిన ఉచిత కంది విత్తనాల పంపిణీ కార్య క్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
కళ్యాణదుర్గం, జూన 29(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కళ్యాణదు ర్గం మార్కెట్ యార్డు చైర్మన లక్ష్మీదేవి రమేష్ పేర్కొ న్నారు. స్థానికం గా సోమవారం నిర్వహించిన ఉచిత కంది విత్తనాల పంపిణీ కార్య క్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ శాఖ ఏడీ యల్లప్ప, ఏవో శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆత్మనిర్భర్ పథకం కింద గతంలో కంది సాగు చేసిన రైతులను గుర్తించి ఉచితంగా కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఎల్ అర్జీ 13,333, ఎల్ అర్జీ 105, ఎల్ అర్జీ 52 రకాల విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖాధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....