TANK: శిథిలావస్థలో తాగునీటి ట్యాంకు
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:57 PM
మండల కేం ద్రంలో తాగునీరు సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. కూడేరు ప్రాథమిక పాఠ శాల, జిల్లా పరిషత ఉన్నత పాఠశాలల మధ్యనున్న ఈ ట్యాం కు శిథిలాస్థకు చేరుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ న చెందుతున్నారు.
కూడేరు, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): మండల కేం ద్రంలో తాగునీరు సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. కూడేరు ప్రాథమిక పాఠ శాల, జిల్లా పరిషత ఉన్నత పాఠశాలల మధ్యనున్న ఈ ట్యాం కు శిథిలాస్థకు చేరుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ న చెందుతున్నారు. గ్రామం మొ త్తం తాగునీరు సరఫరా అయ్యే ట్యాంకు ను చాలా సంవత్సరాల క్రితం ని ర్మించారు. ప్రస్తుతం అధ్వాన స్థితి కి చేరింది. విద్యార్థులు చదువుకునే ప్రాంతంలో శిథిలాస్థలో ఉన్న ట్యాంకు ఉండటం వల్ల ప్రమాదా లు జరిగే అవకాశం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి, వెంటనే నూతన ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని వారు అంటున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....