ROAD: తవ్వారు.. వదిలేశారు..!
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:29 PM
కేబుల్ లైన్ల ఏర్పాటు పేరుతో రహదారిని తవ్వేశారు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డి. హీరేహాళ్ మండలంలోని బాధనాల, దొడఘట్ట గ్రామాల రోడ్డు పక్కన ఓ మొ బైల్ నెట్‌వర్క కేబుల్ పనుల కోసం చేపట్టిన తవ్వకాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.
డి. హీరేహాళ్(బొమ్మనహాళ్), జూన 8(ఆంధ్రజ్యోతి): కేబుల్ లైన్ల ఏర్పాటు పేరుతో రహదారిని తవ్వేశారు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డి. హీరేహాళ్ మండలంలోని బాధనాల, దొడఘట్ట గ్రామాల రోడ్డు పక్కన ఓ మొ బైల్ నెట్‌వర్క కేబుల్ పనుల కోసం చేపట్టిన తవ్వకాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. రహదారి అనుకుని లోతుగా గుంతలు తవ్వా రు. కానీ వాటిని సక్రమంగా పూడ్చ కపోవడంతో పాటు మట్టిని రోడ్డు మధ్యలో వదిలేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ మట్టి బుర దగా మారి వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయా ణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాలు అయిన సంఘటనలు చోటుచేసుకోన్నాయని పలు గ్రామాల ప్రజలు తెలిపారు. అంతేగాకుండా గుంతలు తవ్విన ప్రాంతాలు వర్షాల కారణం గా కుంగిపోవడంతో రోడ్డు మరింత దెబ్బతిందని ప్రజలు ఆరోపిస్తు న్నారు. కేబుల్ లైన్ల కోసం తవ్వకాలు చేపట్టిన సంస్థ నిబంధనలు పాటించిందా లేదా అనే విషయాలను సంబంధిత అధికారులు శ్రద్ధ పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తవ్వకాలపై విచారణ జరిపి రోడ్డును యధాస్థితికి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రమాదం జరిగాక చర్యలు తీసుకోవడం కాకుండా ముందస్తుగా స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....