Share News

RAIN: కష్టం.. నష్టం

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:32 PM

అనంతపురం జిల్లాలో మంగళవారం రాత్రి 11 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కళ్యాణదుర్గంలో 19.0 మీ.మీ వర్షపాతం నమోదైంది. బెళుగుప్ప 14.6, డి.హీరేహాళ్‌ 13.4, కూడేరు 11.2, రాయదుర్గం 9.3, బ్రహ్మసముద్రం 9.2, శెట్టూరు 8.6, ఆత్మకూరు 6.4, గుమ్మఘట్ట 6.0, కణేకల్లు 5.0, పామిడి మండలాల్లో 3.4 మీ.మీ వర్షపాతం నమోదైంది.

RAIN: కష్టం.. నష్టం
Banana crop damaged by strong winds (Kuderu)

(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్‌)

అనంతపురం జిల్లాలో మంగళవారం రాత్రి 11 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కళ్యాణదుర్గంలో 19.0 మీ.మీ వర్షపాతం నమోదైంది. బెళుగుప్ప 14.6, డి.హీరేహాళ్‌ 13.4, కూడేరు 11.2, రాయదుర్గం 9.3, బ్రహ్మసముద్రం 9.2, శెట్టూరు 8.6, ఆత్మకూరు 6.4, గుమ్మఘట్ట 6.0, కణేకల్లు 5.0, పామిడి మండలాల్లో 3.4 మీ.మీ వర్షపాతం నమోదైంది. కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, గార్లదిన్నె మండలాల్లో 67 ఎకరాల్లో రూ. 1.95 కోట్ల విలువైన కోత దశలోని అరటి పంట దెబ్బతింది. బెళుగుప్ప మండలంలో 59 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. గార్లదిన్నె మండలంలో 13 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతింది. శింగనమలలో రెండున్నర ఎకరాల్లో రూ.1.8 లక్షల విలువైన కాకర పంట, శెట్టూరులో 2 ఎకరాల్లో రూ.1.6 లక్షల విలువైన బీర పంట దెబ్బతింది.

- బెళుగుప్ప మండలంలో 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జీడిపల్లిలో రైతు తిమ్మప్పకు చెందిన 20 ఎకరాలు, శ్రీరాములుకు చెందిన 15 ఎకరాలు, అక్కులన్న నాలుగు ఎకరాలు, యర్రిస్వామి నాలుగు ఎకరాలు, తిమ్మేష్‌ ఐదు ఎకరాలు, ధనుంజయ మూడు ఎకరాలలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. గంగవరంలో రాముకు చెందిన ఐదు ఎకరాలు, రాజశేఖర్‌కు చెందిన రెండు ఎకరాలలోని అరటి, మూడు ఎకరాలలోని మొక్కజొన్న పంటలు, జీడిపల్లి నారాయణ స్వామి తోటలో రెండు ఎకరాలు, బెళుగుప్పకు చెందిన ప్రవీణ్‌కు చెందిన రెండు ఎకరాలలో అరటి పంట నేలవాలింది.

- కూడేరు మండలంలోని చోళసముద్రం గ్రామంలో శివప్ప, రాంబిమా తదితరుల అరటి పంట, అంతరగంగలో మల్లికార్జున సాగు చేసిన మూడు ఎకరాల మొక్కజొన్న పంట దెబ్బతినింది. మండల వ్యాప్తంగా 22.5 ఎకరాల్లో అరటి, మూడెకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతింది.

- గుమ్మఘట్ట మండలంలోని గోనబావి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వడ్డే మారన్న ఇంటి వద్ద పిడుగుపడి రెండు కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. ఈదురుగాలులతో కొద్దిపాటి వర్షం కురిసింది.


- పెనుకొండలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.

- కొత్తచెరువులో బుధవారం సాయంత్రం 3గంటల నుంచి 5గంటల వరకు వడగండ్ల వాన కురిసింది. మండలంలోని తలమర్ల గ్రామంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. బుక్కపట్నంలో వడగండ్లతోకూడిన వర్షం పడటంతో మామిడి పిందెలు రాలిపోయాయని మామిడి రైతులు వాపోయారు.

- గార్లదిన్నె మండలంలోని కల్లూరు ఆగ్రహారం గ్రామంలో వేణుగోపాల్‌, నాగిరెడ్డి, పెద్దిరెడ్డి మరో ఇద్దరు రైతులకు చెందిన 10 ఎకరాలు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. కృష్ణాపురం గ్రామంలో రామాంజినేయులుకు చెందిన 2 ఎకరాలలో వరి పంట నేలవాలింది.

- గోరంట్లతోపాటు మండలంలోని కసిరెడ్డిపల్లిలో బుధవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. సాయంత్రం 4గంటల సమయంలో ఓమోస్తరు వర్షం కురవగా, కొద్దిసేపు మాత్రం సన్నపాటి వడగండ్లు పడ్డాయి.

- శింగనమల మండలంలోని లోలూరు గ్రామంలో ఈదురుగాలులకు రైతు వెంకట్రామిరెడ్డి కాకర పంట నేలకు ఒరిగింది. దీంతో రూ. 3లక్షలు వరకు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 18 , 2026 | 11:32 PM