CHAIRMAN: టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయండి
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:18 AM
రాయలసీమను టూరి జం సర్క్యూట్‌గా, తాడిప త్రిని టెంపుల్ సిటీగా అ భివృద్ధి చేయాలని మున్సి పల్ చైర్మన జేసీ ప్రభా కర్ రెడ్డి కోరారు. గుత్తి పట్టణం ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో జరిగిన గు త్తికోట ఉత్సవాలలో ఆ యన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ ఆనంద్‌కు వినతి పత్రం సమర్పించారు.
- కలెక్టర్‌ను కోరిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన
గుత్తి/తాడిపత్రి, మార్చి14 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను టూరి జం సర్క్యూట్‌గా, తాడిప త్రిని టెంపుల్ సిటీగా అ భివృద్ధి చేయాలని మున్సి పల్ చైర్మన జేసీ ప్రభా కర్ రెడ్డి కోరారు. గుత్తి పట్టణం ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో జరిగిన గు త్తికోట ఉత్సవాలలో ఆ యన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ ఆనంద్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాడిపత్రి ప్రాధాన్యతను గుర్తించే విధంగా ఈ ఉత్సవాలలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. తాడిపత్రిలో శతాబ్దాల నాటి శిల్పకల వైభవాలు కలిగిన దేవాలయాలు, చారిత్రాత్మక నేపథ్యం కలిగిన గుత్తికోట, లేపాక్షి ఆలయం, బెలూంగుహలు, గండి కోట చారిత్రక ప్రదేశాలు, పెన్నాహోబిలం, కసాపురం తదితర ప్రాంతా లను కలుపుతూ సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. తన సొంత ఖర్చులతో అనంతపురం నుంచి తాడిపత్రికి వారానికి ఒకసారి ఉచిత భోజన సౌకర్యంతో బస్సు సౌకర్యం కల్పించి ఆలయాలు సందర్శించే విధంగా ఏర్పాటు చేసే ఆలో చన ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి టూరిజం ఎంతో దోహదప డుతుందని ఎంపీ, ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....