Share News

MLA: డిజిటలైజేషనతో భూవివాదాలకు అడ్డుకట్ట

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:38 PM

భూరికార్డులన్నీ డిజిటలైజ్‌ చేయడం వల్ల సరిహద్దు తగాదాలు, ఇతర భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని డీ కొండాపురం గ్రామంలో గురువారం తహసీల్దార్‌ హరికుమార్‌ ఆధ్వర్యంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

MLA: డిజిటలైజేషనతో భూవివాదాలకు అడ్డుకట్ట
MLA Kalava distributing passbooks to farmers

- ఎమ్మెల్యే కాలవ ఫ పాసు పుస్తకాల పంపిణీ

రాయదుర్గం రూరల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): భూరికార్డులన్నీ డిజిటలైజ్‌ చేయడం వల్ల సరిహద్దు తగాదాలు, ఇతర భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని డీ కొండాపురం గ్రామంలో గురువారం తహసీల్దార్‌ హరికుమార్‌ ఆధ్వర్యంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తున్న రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకం రైతుకు తన భూమిపై సంపూర్ణ హక్కు కల్పిస్తుందని వెల్లడించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలు రక్తసంబంధీకుల మధ్య విభేదాలకు కీలకంగా మారాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రైతులకు రాకూడదన్న దృఢసంకల్పంతో సీఎం చంద్రబాబు భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ లోగా అన్ని గ్రామాల్లో రీసర్వే పూర్తిం చేయించి రైతులకు రాజముద్రలతో కూడిన తప్పులు లేని పాసుపుస్తకాలు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి సంకల్పమన్నారు. పాస్‌పుస్తకాల్లో ఇకమీదట ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఉండరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతబాబు, టీడీపీ మండ కన్వీనర్‌ కురుబ హనుమంతు, టీడీపీ నాయకులు రామ్మూరి, వీరేష్‌స్వామి, సోమశేఖర్‌, లచ్చన్నచౌదరి హనుమంతు, ఉమేష్‌, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 09 , 2026 | 11:38 PM