Share News

WINDS: ఈదురు గాలులతో దెబ్బతిన్న పంటలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:41 PM

మండల వ్యాప్తంగా మంగళ వారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంట భారీగా దెబ్బతి నడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఉబిచెర్ల, కరిడికొండ, బేతాపల్లి తదితర గ్రామాల్లో రైతులు మామిడి పంటను సాగు చేశారు. ఊటకల్లు గ్రామంలో దాదాపు 300 ఎకరాలకు పైగా సాగు చేశారు.

WINDS: ఈదురు గాలులతో దెబ్బతిన్న పంటలు
Farmer Giri Reddy's paddy crop was blown down due to strong winds in Kalugadu

గుత్తి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా మంగళ వారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంట భారీగా దెబ్బతి నడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఉబిచెర్ల, కరిడికొండ, బేతాపల్లి తదితర గ్రామాల్లో రైతులు మామిడి పంటను సాగు చేశారు. ఊటకల్లు గ్రామంలో దాదాపు 300 ఎకరాలకు పైగా సాగు చేశారు. అయితే మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మామిడి కాయలు భారీగా రాలిపోయాయని రైతులు లక్కీరెడ్డి శేఖర్‌, బాలకృష్ణ, శ్రీరాములు, గోపాల్‌ వాపోయారు. పంట చేతికివచ్చిన దశలో ఈదురు గాలులకు కాయలు నేలరాలి తీవ్రంగా నష్టపోయామన్నారు. ఒక్కో రైతు తోటలో 70 నుంచి 100 బాక్స్‌ల వర కు కాయలు నేలరాలాయని రైతులు గోపాల్‌, శ్రీనివాసులు, సుధాకర్‌, పులికొండ ఆవేదన వ్యక్తం చేశారు. రూ. లక్షలు పెట్టుబడి పెట్టినా దిగు బడి వచ్చే దశలో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

గుమ్మఘట్ట: మండలంలోని కలుగోడు గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు వరిపంట నేలకొరిగింది. గ్రామానికి చెందిన రైతు గిరిరెడ్డి తన ఐదెకరాల్లో బీటీపీ ఎడమకాలువ కింద వరిసాగు చేశాడు. మంగళవారం రాత్రి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులు వీచడంతో చేతికొచ్చిన వరిపంట నేలకొరిగింది. దీంతో రైతు లబోదిబోమంటున్నాడు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2026 | 11:41 PM