Share News

FIRE: పంటలకు నిప్పు

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:07 AM

మండలపరిధిలోని కడదరకుం ట గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ తోటల్లో జరిగిన ప్రమాదంలో దానిమ్మ చెట్లతో పాటు బెండ, అలసంద పంటలు కాలిపోయాయి. దీం తో రూ. లక్షలో నస్టం వాట్టిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.

FIRE: పంటలకు నిప్పు
A burnt pomegranate orchard in Kadadarakunta

కూడేరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని కడదరకుం ట గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ తోటల్లో జరిగిన ప్రమాదంలో దానిమ్మ చెట్లతో పాటు బెండ, అలసంద పంటలు కాలిపోయాయి. దీం తో రూ. లక్షలో నస్టం వాట్టిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. కడదరకుంట గ్రామానికి చెందిన కూర్మం రామాంజినేయు లు తన ఆరెకరాల వ్యవసాయ తోటను పట్టణానికి చెందిన శివ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. అందులో ఆరేళ్ల వయస్సున్న రెండు వేల దాని మ్మ చెట్లు ఉన్నాయి. పక్కనే గొల్ల మహేష్‌ అనే రైతు తన పొలంలో 50 చందనం మొక్కలు, 8 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ సమీపంలోనే కొనకొండ్ల ఇటికలప్ప తన వ్యవసాయ తోటలో బెండ, అలసంద పంట లు సాగు చేశారు.


అయితే గురువారం మధ్యాహ్న సమయంలో ఆ తో టల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతోనే మంట లు చెలరేగినట్లు బాధిత రైతులు, గ్రామస్థులు చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదంలో చెట్ల, మొక్కలతో పాటు డ్రిప్‌, వ్యవసాయ పరికాలు, తదితర సామగ్రి కాలిపోవడంతో రూ. లక్షలు నష్టం వాట్టిల్లిందని అం టున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. పంటల నస్టం అంచనా వేయలేమని స్థానికులు అంటున్నారు.

బ్రహ్మసముద్రం : మండలపరిధిలోని చెలిమేపల్లిలో గుర్తుతెలియ ని వ్యక్తులు నిప్పుపెట్టడంతో ఓ పేద రైతు పంట పూర్తి కాలిపోయింది. గ్రామానికి చెందిన పూలకుంట యర్రిస్వామి అనే రైతు ఎంతో కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంటను దుండగులు నిప్పుపెట్టి తగలబెట్టా రని గ్రామస్థులు తెలిపారు. చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతికావడం తో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ మండల కన్వీనర్‌ పాల బండ్ల శ్రీరాములు ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత రైతును పరా మర్శించారు. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 13 , 2026 | 12:07 AM