Share News

WATER: కురాకుల తోట కాలనీలో దాహపు కేకలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:00 AM

వేసవి కాలం ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలోని కురాకులతోట కాలనీవా సులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మంగళవారం సీపీ ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WATER: కురాకుల తోట కాలనీలో దాహపు కేకలు
Colony residents and women protesting with empty bins

కురాకుల తోట కాలనీలో దాహపు కేకలు

- సీపీఐ ఆధ్వర్యంలో కాలనీవాసుల ధర్నా

కళ్యాణదుర్గం రూరల్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): వేసవి కాలం ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలోని కురాకులతోట కాలనీవా సులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మంగళవారం సీపీ ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ పీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హ యాంలో ఏర్పాటైన జగనన్న కాలనీలో ప్రస్తుతం సుమారు 300 కు టుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. అక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా వుందన్నారు. ఒక బోరు పూర్తిగా మట్టితో కూరుకపోయిందని, మరో బోరులో నీరు రావడం లేదన్నారు. ప్రజలు బిందెడు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. జలజీవన మిషన పథకం కొళాయిలు లేవన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆ ర్డీవో వసంతబాబుకు విన్నవించారు. స్పందించిన ఆర్డీవో మున్సిపల్‌ కమిషనర్‌తో కలిసి కాలనీలో పర్యటించి, మూడు రోజుల్లో సమస్య ను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు బుడేన సనావుల్లా నాయకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 01 , 2026 | 12:00 AM