STRIKE: కొనసాగిన సత్యసాయి కార్మికుల సమ్మె
ABN , Publish Date - May 07 , 2026 | 11:38 PM
ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ సత్యసాయి నీటి పథకం కార్మికులు చేపట్టిన స మ్మె గురువారం కొనసాగింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వారు రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సత్యసాయిబాబా నీటి పథకాన్ని జిల్లా పరిషతకు అప్పగిం చవద్దని, ట్రస్ట్ ద్వారానే నడపాలని డిమాండ్ చేశారు.
తాడిపత్రి, మే7(ఆంధ్రజ్యోతి): ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ సత్యసాయి నీటి పథకం కార్మికులు చేపట్టిన స మ్మె గురువారం కొనసాగింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వారు రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సత్యసాయిబాబా నీటి పథకాన్ని జిల్లా పరిషతకు అప్పగిం చవద్దని, ట్రస్ట్ ద్వారానే నడపాలని డిమాండ్ చేశారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటా యించాలన్నారు. తమకు ఐదునెలలుగా వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు.
ప్రభుత్వం అధికారు లు స్పందించి త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీటి పథకం కార్మికులు రంగనాయకులు, టి. రామాంజనేయులు శ్రీనివాసులు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండ: ఐదు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సత్యసాయి కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం మూడో రోజుకు చేరింది. వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల సత్యసాయి పంప్‌హౌస్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. వేతనాలు చెల్లించేవరకూ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు చిన్నబాబయ్య, చెన్నయ్య, జయన్న, బీమేష్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....