STRIIKE: కొనసాగిన తాగునీటి కార్మికుల సమ్మె
ABN , Publish Date - May 08 , 2026 | 11:33 PM
సత్యసాయి తాగునీటి పథకంలో పని చేస్తున్న కార్మికుల సమ్మె నాలుగోరోజుకు చేరింది. శుక్రవారం పీఏబీఆర్ డ్యాం లోని సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు వద్ద కార్మికులు నిరసనకు దిగారు. వేతనాలు చెల్లించాలని, న్యాయ మైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కూడేరు, మే 8(ఆంధ్రజ్యోతి): సత్యసాయి తాగునీటి పథకంలో పని చేస్తున్న కార్మికుల సమ్మె నాలుగోరోజుకు చేరింది. శుక్రవారం పీఏబీఆర్ డ్యాం లోని సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు వద్ద కార్మికులు నిరసనకు దిగారు. వేతనాలు చెల్లించాలని, న్యాయ మైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమ్మెతో కూడేరు మండలంలోని హంసపల్లి, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేట, కొర్రకోడు, చోళసముద్రం, ముద్దలాపురం, కడదరకుంట, కూడేరు, కరుట్లపల్లి తదితర గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని కార్మికులు తెలిపారు.
కళ్యాణదుర్గం రూరల్: తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని సత్యసాయి తాగునీటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరవధిక స మ్మెలో భాగంగా వారు నాలుగో రోజు శుక్రవారం రిలే దీక్షలను కొనసాగించారు. వేతనాలు చెల్లించ డంతో పాటు వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తాడిపత్రి: సత్యసాయి నీటి పథకం కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలను రెండోరోజు శుక్రవారం కొనసాగించారు. త క్కువ జీతాలతో పనిచేస్తున్న తమకు సమయానికి వేతనాలు అందక కుటుంబ పోషణ కష్టమవుతోంద ని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....