Share News

GOD: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:56 PM

పట్టణం లోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆల యంలో వల్లీదేవసేన సమే త న్రాగ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠను శని వారం ఘనంగా నిర్వహిం చారు.

GOD: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
Idols consecrated in the temple

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ

తాడిపత్రి, జూన 20 (ఆంధ్రజ్యోతి): పట్టణం లోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆల యంలో వల్లీదేవసేన సమే త న్రాగ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠను శని వారం ఘనంగా నిర్వహిం చారు. వాటితో పాటు ఆలయంలో సిద్ధివినాయక, కాలభైరవ, దక్షిణా మూర్తి, రాహువు, కేతువు, సంతాన నాగమ్మ, అశ్వత్థ నారాయణ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అర్చకులు జానకీరామశర్మ ఆధ్వర్యంలో జరగిన ఈ కార్యక్రమంలో భాగంగా గురు, శుక్రవారాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వాములను దర్శించుకున్నారు. ప్రతిష్ఠ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 20 , 2026 | 11:56 PM