Share News

WATER: తాగునీటి కోసం ఆందోళన

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:45 PM

వజ్రకరూ రులోని జగనన్న కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిం చాలని కాలనీ వాసులు సోమవారం ఆందోళన నిర్వ హించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు.

WATER: తాగునీటి కోసం ఆందోళన
Women staging a protest in Vajrakarur.

వజ్రకరూరు(ఉరవకొండ), జూన 29(ఆంధ్రజ్యోతి): వజ్రకరూ రులోని జగనన్న కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిం చాలని కాలనీ వాసులు సోమవారం ఆందోళన నిర్వ హించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా, తాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో ఉప్పు నీరే తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఒక్క బోరులోనూ నీరు అరకొరగా వస్తున్నాయని తెలిపారు. ఆందోళన కారులతో తహసీల్దారు జయశ్రీ మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం ఆ కాలనీ వాసులు ఎంపీడీవోకు వినతి పత్రాన్ని అందజేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 29 , 2026 | 11:45 PM