Share News

WATER: తాగునీటి కోసం ఆందోళన

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:24 AM

మండల పరిధిలోని మోపిడి గ్రామంలో తాగు నీటి కోసం మహిళలు శనివారం ఆందోళన చేపట్టారు. గ్రామంలోని పడమటి వీధి ప్రాంతం మ హిళలు స్థానిక ఉరవకొండ - కళ్యాణదుర్గం రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు.

WATER: తాగునీటి కోసం ఆందోళన
Women staged a sit-in on the road with empty water pots.

ఉరవకొండ, జూన 27(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని మోపిడి గ్రామంలో తాగు నీటి కోసం మహిళలు శనివారం ఆందోళన చేపట్టారు. గ్రామంలోని పడమటి వీధి ప్రాంతం మ హిళలు స్థానిక ఉరవకొండ - కళ్యాణదుర్గం రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలోని తమ కాలనీకి దాదాపు 20రోజులపైగా నీటి సరఫరా కావడం లేదన్నారు. నీరు రాకపోతే ఏమి తాగాలని మహిళలు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమస్య తలెత్తిందని మండిపడ్డారు. గంట పాటు రహదారిపై రాస్తారొకో చేపట్టడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు అక్కడకి చేరుకున్ని తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఓహెచఎస్‌ఆర్‌ వాల్వ్‌ రాడ్‌ విరగడం వల్లే సమస్య

-ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ షఫ్రీన

ఓహెచఎస్‌ఆర్‌ దగ్గర ఉన్న వాల్వ్‌ రాడ్‌ను ఫ్రెషర్‌తో తిప్పడం వల్ల అది విరగి నీటి సమస్య ఏర్పడిందని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ షఫ్రీన తెలిపారు. ఓహెచఎస్‌ఆర్‌ నుంచి జీఎల్‌ఎస్‌ఆర్‌ కనెక్షన ఇవ్వడానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, దీంతో నీటి పంపింగ్‌ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. త్వరలోనే వాల్వ్‌ తెప్పించి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 28 , 2026 | 12:24 AM