MLA: సెప్టెంబరు కల్లా చెత్త శుద్ధి పూర్తి
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:55 PM
స్థానిక డంపింగ్ యార్డ్ లో చేపట్టిన చెత్తశుద్ధి ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపా రు. డంపింగ్ యార్డులో జరుగుతున్న చెత్తశుద్ధి, వ్యర్థాల నిర్వహణ పనుల ను శనివారం ఆయన పరిశీలించారు.
- ఎమ్మెల్యే కాలవ
రాయదుర్గం, జూన 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక డంపింగ్ యార్డ్ లో చేపట్టిన చెత్తశుద్ధి ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపా రు. డంపింగ్ యార్డులో జరుగుతున్న చెత్తశుద్ధి, వ్యర్థాల నిర్వహణ పనుల ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ డంపింగ్ యార్డులో లక్ష మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దా నిని శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధిచేసి ఎరువుగా మార్చే ప్రక్రియ కొనసా గుతోందని తెలిపారు. ఇప్పటివరకు 40 వేల మెట్రిక్ టన్నుల చెత్తను ఎరువుగా మార్చగా, మరో 60 వేల మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేయాల్సి ఉందన్నారు. పట్టణంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తకు శాశ్వత పరిష్కారం చూపేదిశగా ప్రభు త్వం కీలక చర్యలు తీసుకుం టోందన్నారు. 63 ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయిలో శుభ్రపరుస్తుండటం సంతోషక రమన్నారు. ఈ చెత్త శుద్ధి కోసం సుమా రు రూ. 8 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని వ్య క్తిగత మరుగుదొడ్ల నుంచి సేకరించే మ లినాలను శాస్త్రీయపద్ధతిలో శుద్ధి చేసే ప్రత్యేక యూనిట్‌ను రూ. 2 కోట్లతో ఏ ర్పాటు చేసినట్లు చెప్పారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రాసెసింగ్ చేసే ఆధు నిక వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను మరో రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశామని వివ రించారు. పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరి చేందుకు రూ. 13 కోట్లు ఖర్చు చేస్తున్నా మన్నారు. భవిష్యత్తులో పట్టణం నుంచి వచ్చే చెత్తతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల మలినాలను కూడా ఇక్కడే శుద్ధిచేయడం ద్వారా రాయదుర్గాన్ని పరిశుభ్రమైన పట్ట ణంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...