GOD: భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:49 PM
పట్టణంలో భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వేదపండితులు ఉదయం గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, దీక్షాధారణ, కలశస్థాపనతో పాటు సాయం త్రం హోమాలు నిర్వహించారు.
పామిడి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): పట్టణంలో భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వేదపండితులు ఉదయం గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, దీక్షాధారణ, కలశస్థాపనతో పాటు సాయం త్రం హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
బొమ్మనహాళ్: మండలంలోని కలుదేవ నహళ్లిలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అభ యాంజేయస్వామి విగ్రహాల ప్రతిష్ఠకు సోమవారం అంకురారోపణ చేశారు. గ్రామ సమీపంలోని వేదావతి హగరి నది నుంచి జలాన్ని ఊ రేగింపుగా తీసుకొచ్చి పూజలు ప్రారంభించారు. ముందుగా విష్వక్సేనా రాధన, పుణ్యాహ వాచనం, గోపూజ, యాగశాల ప్రవేశం, తదితర పూజలు చేశారు. సాయంత్రం విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం, ద్వారతోరణ నిర్వహించారు. భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....