COLLECTOR: కలెక్టర్ సుడిగాలి పర్యటన
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:59 PM
కలెక్టర్ ఒ. ఆనంద్ పామిడి మండలంలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలోని ఎం లక్ష్మీదేవి ఇంటిపై అమర్చిన పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెల్‌ను పరిశీలించారు. పట్టణంలో 50 యూనిట్లకు ప్రస్తుతం 35 యూనిట్లు పూర్తయినట్లు ట్రాన్స కో ఏఈ మధుసూదనరావు పేర్కొన్నారు.
- పీఎం సూర్యఘర్ పరిశీలన
- జలధారపై సమీక్ష
- ప్రజలకు పలు సలహాలు
పామిడి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ ఒ. ఆనంద్ పామిడి మండలంలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలోని ఎం లక్ష్మీదేవి ఇంటిపై అమర్చిన పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెల్‌ను పరిశీలించారు. పట్టణంలో 50 యూనిట్లకు ప్రస్తుతం 35 యూనిట్లు పూర్తయినట్లు ట్రాన్స కో ఏఈ మధుసూదనరావు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా 2కేవీ సోలార్ ప్యానెల్‌ను అమర్చుతున్నామన్నారు. ఈ పథకంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వీధిలో ఉన్న చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. ఎండలు మండిపోతున్నాయని, ఇంటి వద్దనే ఉండాలని వారికి తెలిపారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని సొరకాయలపే టలో డ్రోన ద్వారా మందు పిచికారిని పరిశీలించారు. డ్రోన వినియోగంపై యువ రైతు భార్గవ్‌తో ఆరా తీశారు. మూడు ట్యాంకుల మం దును రెండు ఎకరాలకు పిచికారి చేయవచ్చని భార్గవ్ తెలిపారు. డ్రోన విలువ రూ. 9.81లక్షలు అవుతుందన్నారు. అనంతరం కలెక్టర్ ఎద్దులపల్లిలో రైతులతో ముచ్చటించారు.
చిన్న సన్న కారు రైతులకు సంఘాల ద్వారా ట్రాక్టర్, వ్యవసాయ యాంత్రిక పరికరాలు అందజేయడం వల్ల తక్కువ పెట్టుబడితో వ్యవసాయ పనులు చేసుకోవచ్చని తెలిపారు.రీసర్వేలో తలెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ను రైతులు కోరారు. గతంలోని విలేజ్ సర్వేయర్ మంజునాథ్ చేసిన తప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతలు తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ షర్మిలకు కలెక్టర్ సూచించారు. మండలంలో జలధార - జలహారతి, మండల యాక్షన ప్లానపై అధికారులతో సమీక్షించారు. మండలంలో రూ. 4కోట్లతో 109 పనులు గుర్తించినట్లు ఎంపీడీవో తేజోత్స్న తెలిపారు. ఎద్దులపల్లి పీహెచసీలో వైద్య సిబ్బంది పనితీరుపై పలువురు ఫిర్యాదు చేయగా, ఆశాఖ ఉన్నతాధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన డీఈ బసవరాజు, ఏఈఈ కిషోర్, డిప్యూటీ ఎంపీడీవోలు అశ్వత్థమనాయుడు, రంగనాయకులు, వ్యవసాయాధికారి విజయ్ కుమార్, ట్రాన్స కో ఏఈ మధుసూదనరావు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....