Share News

MLA: బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా

ABN , Publish Date - May 03 , 2026 | 12:16 AM

పేదలకు వైద్యఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలోని తన నివాసంలో ఆయన శనివారం ఆయన బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

MLA: బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా
MLA Kalava with those who received the cheques

- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, మే 2(ఆంరఽధజ్యోతి): పేదలకు వైద్యఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలోని తన నివాసంలో ఆయన శనివారం ఆయన బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అ త్యవసర వైద్యచికిత్స పొందిన పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పెద్ద మనస్సుతో ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. వైద్యఖర్చులతో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కు టుంబాలకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలుస్తోందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారానే ముఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గత 22 నెలల కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో 363 మందికి రూ. 2.43 కోట్ల ఆర్థిక సా యం అందించామని వెల్లడించారు. శనివారం 28 మంది లబ్ధిదారులకు రూ. 11.62 లక్షల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కాదలూరు మోహనరెడ్డి, వన్నారెడ్డి, కురుబ హనుమంతు, ఆర్యవైశ్య కార్పోరేషన డైరెక్టర్‌ నాగళ్లి రాజు, హనకనహాళ్‌ నాగార్జున, ఎస్‌కే మల్లికార్జున, రైస్‌మిల్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 03 , 2026 | 12:16 AM