MLA: ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:51 PM
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నా రా లోకేశ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. 2004 కంటే ముందు ఉపాధ్యాయులుగా పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన విధానం అమలు చేసినందుకు గాను శుక్రవారం పట్టణంలోని ప్రజా వేదిక వద్ద కృతజ్ఞత సభను నిర్వహించారు.
-ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
కళ్యాణదుర్గం, జూన 26(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నా రా లోకేశ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. 2004 కంటే ముందు ఉపాధ్యాయులుగా పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన విధానం అమలు చేసినందుకు గాను శుక్రవారం పట్టణంలోని ప్రజా వేదిక వద్ద కృతజ్ఞత సభను నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే, ఉపాధ్యాయులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన ఉపాఽధ్యాయు లతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల్లో చూపిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం పాఠశాలలను నిర్వీర్యం చేసేలా 117 జీవో ఇవ్వడంతో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడ్డా రన్నారు.
కానీ కూటమి అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూశా రన్నారు. అంతేకాకుండా డీఎస్సీ నిర్వహించి ఏకంగా 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి పెద్ద పీట
కళ్యాణదుర్గం: పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీ ట వేస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. సీఎం సహా య నిధి ద్వారా నియోజకవర్గంలోని 25 మందికి మంజూరైన రూ. 10,42,800చెక్కులను పట్టణంలోని ప్రజావేదిక వద్ద శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....