MLA: రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:00 AM
వ్యవసాయంలో రైతులను అన్ని విధాలా ఆదుకోవడంలో సీఎం చంద్ర బాబునాయుడు ముందుంటారని, రైతుల పక్షపాతి అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీని వాసు లు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని శనివారం మండ లంలోని కెంచానపలిలో వ్యవసాయ శాఖ ఏడీ పద్మజ ఆధ్వర్యం లో నిర్వహించారు.
ప్రభుత్వ విప్ కాలవ
రాయదుర్గం రూరల్, జూన 20(ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో రైతులను అన్ని విధాలా ఆదుకోవడంలో సీఎం చంద్ర బాబునాయుడు ముందుంటారని, రైతుల పక్షపాతి అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీని వాసు లు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని శనివారం మండ లంలోని కెంచానపలిలో వ్యవసాయ శాఖ ఏడీ పద్మజ ఆధ్వర్యం లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ కాలవ హాజరై మాట్లాడు తూ.... ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త లు చెబుతున్నారని, కావున రైతులు తక్కువ వర్ష పాతానికి పండే పంటలను సాగు వేసుకోవాలని సూచించారు.
నియో జకవర్గంలోని 42 వేల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన సొమ్ము రూ. 28.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చే శామన్నారు. వ్యవసాయాధికారులు అహ్మద్‌బాషా, నిర్మల్‌కుమార్, టీ డీపీ మండల కన్వీనర్ కురుబ హనుమంతు, మార్కెట్ యార్డు చైర్మన హనుమం తరెడ్డి, వైస్ చైర్మన దానవేంద్ర, టీడీపీ నాయకులు పోట్ల ర వి, కాటా వెంకటేశులు, సిద్ధప్ప, రమేష్, సోమశేఖర్, వీరేష్, రాజశేఖర్‌రె డ్డి, మల్లేశ ప్ప, సీతారాములు, ఓబయ్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
లెనిన బాబు కృషి అమోఘం
గుమ్మఘట్ట: సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు విలువల బడుల పేరుతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సేవలు అందిస్తున్న సమాజక్రాంతి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన లెనినబాబు చేస్తు న్న కృషి అమోఘమని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నా మని, దీంతో నియోజకవర్గంలోని నేటి విద్యార్థులు భవిష్యత్తులో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతారని ఆకాంక్షించారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి, విలువల బడుల ద్వారా ఆటపాటలు, క్రీడలలో గెలుపొందిన వి ద్యార్థులకు బహుమతులు అందజేశారు. అడిషనల్ ఎస్పీ మల్లికార్జునవ ర్మ, జిల్లా వైద్యులు సుధాకర్, ఎంఈవో సోమశేఖర్, టీడీపీ మండల క న్వీనర్ కాలవ సన్నన్న, గిరిమల్లప్ప, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.