Share News

TEMPLE: ఆలయాల మూసివేత

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:45 PM

చంద్రగ్రహణం సంద ర్భంగా జిల్లాలోని ఆల యాలను మంగళవారం మూసివేశారు. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వా మి దేవాలయంతో పాటు బొమ్మనహాళ్‌, డీ. హీరేహాళ్‌ మండలాల్లోని నేమకల్లు, మురిడి గ్రామాల్లో వెలసిన ప్రముఖ ఆంజనేయస్వామి ఆలయాలను ఉదయమే మూసి వేశారు.

TEMPLE: ఆలయాల మూసివేత
Kasapuram temple closing scene

(ఆంధ్రజ్యోతి, నెట్‌ వర్క్‌)

చంద్రగ్రహణం సంద ర్భంగా జిల్లాలోని ఆల యాలను మంగళవారం మూసివేశారు. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వా మి దేవాలయంతో పాటు బొమ్మనహాళ్‌, డీ. హీరేహాళ్‌ మండలాల్లోని నేమకల్లు, మురిడి గ్రామాల్లో వెలసిన ప్రముఖ ఆంజనేయస్వామి ఆలయాలను ఉదయమే మూసి వేశారు. ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని, విడపనకల్లు మండలంలోని పాల్తూరు పంచాయతీలో వెలసిన ఉండబండ వీరభధ్రస్వామి దేవాలయం, బెళుగుప్ప మండలం లోని బూదిగుమ్మ సంజీవరాయస్వామి, బెళుగుప్ప రామలింగేశ్వర స్వా మి, వెంకటరమణ స్వామి, మంజునాథ స్వామి ఆలయాలు మూతపడ్డా యి. కణేకల్లు మండలంలోని నాగేపల్లి ఆంజనేయస్వామి దేవాలయం, కణేకల్లులోని చిక్కణ్ణేశ్వరాలయం, తాడిపత్రి పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన బుగ్గరామలింగేశ్వరస్వామి, చింతల వెంకట రమణస్వామి, ఆలూరుకోన రంగనాథస్వామి, అశ్వత్థ నారాయణస్వామి, చక్ర భీమలింగేశ్వరస్వామి ఆలయాలతో పాటు పలు ఆలయాలు గ్రహణం సందర్భంగా మూసివే శారు. తిరిగి బుధవారం తెల్లవారుజామున ఆలయాలను తెరిచి శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామి వార్ల దర్శనం కల్పిస్తామని ఆయా ఆలయాల అధికారులు, అర్చకులు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 03 , 2026 | 11:45 PM