రైతులకు అండగా ముఖ్యమంత్రి
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:48 PM
: సీఎం చంద్రబాబు రైతులకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. నవ ధాన్యాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్, ముగ్గులను పరిశీలించి, అన్నదాత సుఖీభవ మెగా చెక్కు అందచేశారు.
రాప్తాడు, జూన 20 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు రైతులకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. నవ ధాన్యాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్, ముగ్గులను పరిశీలించి, అన్నదాత సుఖీభవ మెగా చెక్కు అందచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రెండో ఏడాది కూడా రైతులకు అన్నదాతా సుఖీభవ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడాదికి ఒక్కో రైతుకు రూ. 20 వేలు చొప్పున సాయం చేస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2వేల కోట్లు చేసినట్లు తెలిపారు. మార్కెట్ యార్డు చైర్మన సుధాకర్ చౌదరి, డీసీఎంఎస్ చైర్మన నెట్టెం వెంకటేష్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఏవో కృష్ణ చైతన్య, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, మండల కన్వీనర్ కొండప్ప, శ్రీనివాసులు, గోపాల్, రాము, నారాయణస్వామి, నారాయణస్వామి, వెంకట్రాముడు, కిష్టా, బీరన్న పాల్గొన్నారు.
రైతులను దగా చేసిన వైసీపీ
అనంతపురం రూరల్: వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకుండా దగా చేసిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. శనివారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ రైతు సేవా కేంద్రంలో అన్నదాతా సుఖీభవ, పీఎం కిసాన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, జనసేన నగర అధ్యక్షుడు బాబురావు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 371మంది రైతులకు సంబంధించిన రూ.25లక్షలు మెగా చెక్కును రైతులకు పంపిణీ చేశారు. సహాయ వ్యవసాయ సంచాలకులు భూ సంరక్షణ ట్రైనింగ్ సెంటర్ విద్యావతి, ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్, డిప్యూటీ ఎంపీడీవో వెంకటనాయుడు, వ్యవసాయ విస్తరణ అధికారి మురళీకృష్ణ, భాగ్యశ్రీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అన్నదాత సంక్షేమమే లక్ష్యం: కలెక్టర్
బుక్కరాయసముద్రం: రైతుల ఆర్థికాభివృద్ధి, సంక్షమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం రెడ్డిపల్లి కృషివిజ్ఞాన కేంద్రంలో అన్నదాతా సుఖీభవ పథకం 23వ విడుత కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆర్టీసీ రీజనల్ చైర్మన పూలనాగరాజు, ఏపీ సీడ్స్ కార్పొరేషన చైర్మన సుబ్బారెడ్డి, ఏడీసీసీ చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు తమ బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2.75లక్షల మంది రైతులకు రూ.188 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యిందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి అన్నదాతా సుఖీభవ పఽథకం దోహద పడుతుందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు మాట్లడుతూ రాష్ట్రంలో రైతులకు ప్రతి విషయంలో కూటమి ప్రభుత్వం అండగా ఉందన్నారు. మార్కెట్ యార్డు వైస్ చైర్‌పర్సన శైలజ, టీడీపీ నాయకులు పర్వతనేని శ్రీధర్‌బాబు, కేశన్న, లక్ష్మీనారాయణ, ఎంపీపీ సునీత, శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి, ఆదినారాయణ, ఓబులపతి, రవీంద్ర, సోము, ఆది పాల్గొన్నారు.