Share News

GARBAGE: దారిపక్కనే కోడి వ్యర్థాలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:46 PM

మండల కేంద్రంలోని పలు చి కెన సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడిస్తున్నా రు. దీంతో దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

GARBAGE: దారిపక్కనే కోడి వ్యర్థాలు
Chicken waste dumped on the canal embankment

- దుర్వాసనతో స్థానికులు, ప్రయాణికుల అవస్థలు

కూడేరు, జూన 6(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పలు చి కెన సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడిస్తున్నా రు. దీంతో దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూడేరులోని వివిధ చి కెన సెంటర్ల నుంచి వ్యర్థాలను గ్రామ సమీపంలోని తలుపూరుకు వెళ్లే దారిలో పీఏబీఆర్‌ కుడికాలువ గట్లపై వేస్తున్నారు. దీంతో అటుగా వెళ్తు న్న వాహనదారులతో పాటు పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోళ్ల వ్యర్థాలను కాలువపై వేయడంతో వాటి దుర్వాసన భరించలేకపోతున్నామని వారంటున్నారు. అంతేకా కుండా వాటి కోసం వచ్చే కుక్కల సంచారం అక్కడ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అంటున్నారు. మండల కేంద్రంలో డంపింగ్‌ యార్డ్‌ ఉన్నా చికెన సెంటర్ల నిర్వాహుకులు కాలువ గట్టుపై వేయడంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారింది. నిత్యం వందలాది మంది సంచరించే ప్రదేశంలో వ్యర్థాల వ ల్ల దుర్వాసన వస్తున్నా సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చికెన సెంటర్ల నిర్వాహుకులు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చికెన సెంటర్ల నుంచి వచ్చే వ్యర్థాలను డంపింగ్‌ యార్డ్‌ తరలించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...

Updated Date - Jun 06 , 2026 | 11:46 PM