FESTIVAL: అశ్వవాహనంపై చెన్నకేశవస్వామి
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:28 PM
శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధ వారం స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు ద ర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవ మూర్తు లను అశ్వవాహనంపై అ లంకరించి పురవీధుల్లో ఊరేగించారు.
యాడికి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధ వారం స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు ద ర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవ మూర్తు లను అశ్వవాహనంపై అ లంకరించి పురవీధుల్లో ఊరేగించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భ క్తులు పెద్దఎత్తున తర లివచ్చారు. అదేవిధంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి బుధవారం శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాతిదూలం లాగుడు పోటీలను ఆయన పరిశీలించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....