FESTIVAL: గజవాహనంపై చెన్నకేశవుడు
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:50 PM
శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా సోమవారం స్వామివారు.. గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు.
యాడికి, మార్చి2(ఆంధ్రజ్యోతి): శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా సోమవారం స్వామివారు.. గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను గజవాహనంపై అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు.
నేడు కల్యాణోత్సవం, రథోత్సవం
శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యాణోత్సవం, రథోత్సవాలను మంగళవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటలకు రథోత్సవం ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంటకు ముగించనున్నట్లు తెలిపారు. రథోత్సవానికి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఐదుగురు చొప్పున సీఐలు, ఎస్‌ఐలు, వందమంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....