Share News

GOD: జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:56 PM

వజ్రకరూరు మండల కేం ద్రంలో మంగళవారం జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని వైభ వంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, పూజలు చేశారు. ఉదయం పల్లకిసేవ, రథాంగ హోమం, రథ ప్రతిష్ఠాపన, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు.

GOD: జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం
Devotees participating in Rathotsavam

ఉరవకొండ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మండల కేం ద్రంలో మంగళవారం జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని వైభ వంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, పూజలు చేశారు. ఉదయం పల్లకిసేవ, రథాంగ హోమం, రథ ప్రతిష్ఠాపన, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవమూర్తులను రథంలో అధిష్టించి మడుగు తేరు లాగారు. సాయంత్రం రథోత్సవం అశేష జనసమూహం మధ్య ముందుకు సాగింది. రథం పైకి భక్తులు అరటి పండ్లు, జామపండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. సీఐ మహనంది ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణయ్య, పీఏసీఎస్‌ చైర్మన వలి, టీడీపీ నాయకులు కొండయ్య, జయన్న పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 07 , 2026 | 11:56 PM