Share News

OFFICER: పనితీరు మార్చుకోండి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:04 AM

పలు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పని తీరు బాగాలేదని, పద్ధతి మార్చుకోవాలని జిల్లా సచివాలయాల అధికారి నాసర రెడ్డి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి హెచ్చరించారు. స్ధానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పట్ట ణం, మండలంలోని సచివాలయాల సిబ్బందితో సమావేశాన్ని నిర్వ హించారు.

OFFICER: పనితీరు మార్చుకోండి
Nasara Reddy is the officer of the district secretariats who is speaking

- గ్రామ సచివాలయాల సిబ్బందికి జిల్లా అధికారి, జడ్పీ సీఈవో హెచ్చరిక

గుంతకల్లు టౌన, జూన 3(ఆంధ్రజ్యోతి): పలు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పని తీరు బాగాలేదని, పద్ధతి మార్చుకోవాలని జిల్లా సచివాలయాల అధికారి నాసర రెడ్డి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి హెచ్చరించారు. స్ధానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పట్ట ణం, మండలంలోని సచివాలయాల సిబ్బందితో సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని హను మేష్‌నగర్‌, మిల్లుకాలనీలోని సచివాయాలు, మం డలంలోని కసాపురం, దంచర్ల, ఎన వెంకటాంపల్లి, దోనిముక్కల, పాతకొత్తచెరువు సచివాల యాల పనితీరు అధ్వానంగా ఉందని ఇటివల ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ ద్వారా తెలిందన్నారు. సచివాలయానికి వచ్చే లబ్ధిదారుల పట్ట మర్యాదగా మా ట్లాడాలన్నారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాయాలకు తాళాలు వేయరాదన్నారు. సచివాలయాల సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని లేకపోతే చర్యలు తప్పవని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలి..

మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఆడ్మిషన్లు పెంచాలని ఎంపీడీవో దేవదాస్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం మండలపరిషత కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండలంలోని ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఐసీడీఎస్‌, సచివాలయ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలని ఎంపీడీవో వారికి సూచించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 04 , 2026 | 12:04 AM