CCTV: దిష్టిబొమ్మల్లా సీసీ కెమెరాలు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:05 AM
మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమర్చిన సీసీ కెమెరాలు కొంత కాలంగా పని చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు తదితర అన్ని విషయాల సమాచారాన్ని నిఘానేత్రాలు నిక్షిప్తం చేస్తాయి. ఆ స మాచారం ద్వారా బాధ్యులపై చర్య లు తీసుకునే అవకాశం ఉంటుం ది.
కూడేరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమర్చిన సీసీ కెమెరాలు కొంత కాలంగా పని చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు తదితర అన్ని విషయాల సమాచారాన్ని నిఘానేత్రాలు నిక్షిప్తం చేస్తాయి. ఆ స మాచారం ద్వారా బాధ్యులపై చర్య లు తీసుకునే అవకాశం ఉంటుం ది. అంతేగాకుండా రోగులకు 24 గంటలు వైద్య సేవలందించే ఈ ఆసుపత్రిలో వైద్య సి బ్బంది సకాలంలో అందుబాటులో ఉండడం లేదని, రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి నిఘానేత్రాలు స్థానిక పీహెచసీలో ఎందుకు పనిచేయడం లేదని చర్చ వినిపిస్తోంది. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాల మరమ్మతులు చేయించాల్సి అవసరం ఎంతైనా ఉంది.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....