Share News

CANTEEN: పేదలకు వరంగా అన్న క్యాంటీన

ABN , Publish Date - May 14 , 2026 | 11:43 PM

కూటమి అధికారం లోకి వచ్చాక, పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీనను తిరిగి ప్రారంభించింది. రూ.5కే కడుపు నింపే ఈ పథకం పేదల పాలిట అన్నపూర్ణగా మారిం ది. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం ఆవరణంలో నెల రోజు ల క్రితం అన్న క్యాంటీనను ఏర్పాటు చేశారు.

CANTEEN: పేదలకు వరంగా అన్న క్యాంటీన
People eating in Anna's canteen

- రూ. 5కే ఉపహారం, భోజనం

ఉరవకొండ, మే 14(ఆంధ్రజ్యోతి): కూటమి అధికారం లోకి వచ్చాక, పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీనను తిరిగి ప్రారంభించింది. రూ.5కే కడుపు నింపే ఈ పథకం పేదల పాలిట అన్నపూర్ణగా మారిం ది. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం ఆవరణంలో నెల రోజు ల క్రితం అన్న క్యాంటీనను ఏర్పాటు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యా వుల కేశవ్‌ దానిని ప్రారంభించారు. ఇక్కడ రోజూ వివిధ పనులు చేసు కుని ఉపాధి పొందే కూలీలే కాకుండా చిరుద్యోగులు, కార్యాలయాలకు వివిధ పనుల మీద వచ్చే ప్రజలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయా ణికులు తమ ఆకలి తీర్చుకుంటున్నారు. మెనూ ప్రకారం ఉదయం అ ల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించడంతో పాటు మినరల్‌ వా టర్‌ను అందుబాటులో ఉంచారు. కేవలం రూ.5కే నాణ్యమైన, రుచికర మైన భోజనం అందిస్తున్నారు. ప్రజలు అన్న క్యాంటీన్లపై సంతృప్తిని వ్య క్తం చేస్తున్నారు. రోజు ఉదయం 500మంది అల్పాహారం, మధ్యాహ్నం 400 మంది భోజనం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాత్రి వేళల్లో సైతం భోజనం అందించేందుకు ఏర్పాటు చేస్తామని అధికా రులు పేర్కొంటున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 14 , 2026 | 11:43 PM