Share News

TREES: తగలబడిపోతున్న వృక్ష సంపద

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:01 AM

ఆకతాయి చేష్టలకు వృక్ష సం పద కాలిబూడిదై కనుమరుగవుతోంది. మండలంలోని జంబుగుంపల, ఎనుములదొడ్డి గ్రామాల సమీపంలో ఆటవీ ప్రాంతాలతో పాటు పెద్ద కొండలు అధికంగా ఉన్నా యి. సహజ సిద్ధంగా అనేక వృక్షాలు సమృద్ధిగా పెరిగాయి.

TREES: తగలబడిపోతున్న వృక్ష సంపద
A wealth of vegetation burning in flames

-కాపాడే అధికారులే కరువు

కుందుర్పి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ఆకతాయి చేష్టలకు వృక్ష సం పద కాలిబూడిదై కనుమరుగవుతోంది. మండలంలోని జంబుగుంపల, ఎనుములదొడ్డి గ్రామాల సమీపంలో ఆటవీ ప్రాంతాలతో పాటు పెద్ద కొండలు అధికంగా ఉన్నా యి. సహజ సిద్ధంగా అనేక వృక్షాలు సమృద్ధిగా పెరిగాయి. వేసవి దృష్ట్యా వృక్షాలలో ఆకులు ఎండి నేలరాలాయి. దీనికి తోడు ఎండుగడ్డి అధికంగా వుండటంతో ఆకతాయిలు వాటికి నిప్పుపెట్టడంతో కాలిబూడిదైపోతున్నాయి. మండల కేంద్రంలోని పెద్ద కొండ మండల పరిధిలోని మందలపల్లి కొండకు రోజూ ఎక్కడో ఒక చోట నిప్పు పెట్టడంతో వృక్ష సంపదతో పాటు అనేక రకాల పక్షులు, జంతువులు మంటలకు చిక్కి చనిపోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యే క చొరవ తీసుకుని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ఆటవిక ప్రాంతాలకు నిప్పు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 15 , 2026 | 12:01 AM