BUILDING: నిర్మించారు.. వదిలేశారు
ABN , Publish Date - May 16 , 2026 | 11:53 PM
ప్రజల ఆహారభద్రత కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గోదాములు ప్రస్తుతం ఉపయోగంలో లేక వెలవెలబోతున్నాయి. రైతుల నుంచి కొ నుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరచడం, అత్యవసర పరిస్థితుల్లో నిల్వ ఉంచడం లక్ష్యంగా ఈ గోదాములను నిర్మించారు. అయితే నిర్వహణ లోపం వల్ల అవి క్రమంగా నిరుపయోగంగా మారుతున్నాయి.
రాయదుర్గం రూరల్, మే 12(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆహారభద్రత కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గోదాములు ప్రస్తుతం ఉపయోగంలో లేక వెలవెలబోతున్నాయి. రైతుల నుంచి కొ నుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరచడం, అత్యవసర పరిస్థితుల్లో నిల్వ ఉంచడం లక్ష్యంగా ఈ గోదాములను నిర్మించారు. అయితే నిర్వహణ లోపం వల్ల అవి క్రమంగా నిరుపయోగంగా మారుతున్నాయి. మండ లంలోని 74 ఉడేగోళం, జుంజురంపల్లి, డీ కొండాపురం, వేపరాల, ప ల్లేపల్లి, మెచ్చిరి, టీ వీరాపురం తదితర గ్రామాలలో ఒక్కో గోదామును రూ. 40 లక్షల నిధులతో నిర్మించారు. వాటిని ఆహార భద్రత సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కొన్ని పంచాయతీలలో నిర్మాణం పనులు పూర్తైనా వాటిని ప్రారంభించలేదు. ఒకప్పుడు ధాన్యంతో నిండి పోయిన గోదాములు ఇప్పుడు పశువులకు ఆశ్రయాలుగా, చెత్త నిల్వ కేంద్రాలుగా మారిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. రైతులు చెబుతున్న వివరాల ప్రకారం పంట సీజనలో సరిపడా నిల్వ సదుపాయలు లేకపోవడంతో ధాన్యాన్ని ప్రైవేట్ గోదాములకు తరలించాల్సి వస్తోందని రైతులు తెలుపుతున్నారు.
దీని వల్ల రవాణాఖర్చులు పెరగడమే కాకుండా, ప్రభుత్వానికి అదనపు భారం పడుతోందంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయం లోపం, సరైన ప్రణాళిక లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిసు న్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన గోదాములు ఉపయోగంలో లేకపోవడంపై ప్రజల నుంచి వివిధ రకాల ప్రశ్నలు వస్తున్నాయి. నిరుపయోగంగా ఉన్న గోదాములకు మరమ్మత్తులు చేసి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఆహారనిల్వల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్మాణం పూర్తి అయిన గోడౌనలను అధికారుల ఆధీనంలోకి తీసుకొని రైతులకు ఉపయోగపడేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....