FLY OVER: ఫ్లైఓవర్ నిర్మించండి
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:29 PM
మండలకేంద్రం నుంచి మండలపరిధి లోని కొండకమర్ల గ్రామం వరకు వెళ్లే క్రాస్‌లో జాతీయ రహదారిపై (716) నూతనంగా ఫ్లై ఓవర్‌ను నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన రెడ్డిని కోరారు. బొంతలపల్లి సమీపంలో వెళ్లే గ్రీన ఫీల్డ్ హైవే పరిశీలనకు వచ్చిన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
- ఆర్ అండ్ బీ మంత్రికి ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినతి
ఓబుళదేవరచెరువు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రం నుంచి మండలపరిధి లోని కొండకమర్ల గ్రామం వరకు వెళ్లే క్రాస్‌లో జాతీయ రహదారిపై (716) నూతనంగా ఫ్లై ఓవర్‌ను నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన రెడ్డిని కోరారు. బొంతలపల్లి సమీపంలో వెళ్లే గ్రీన ఫీల్డ్ హైవే పరిశీలనకు వచ్చిన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఓడీచెరువు నుంచి కొండకమర్లకు వెళ్లే దారిలో ఇటీవల నూతనంగా 716 నేషనల్ హైవేని ఇటీవల నిర్మించారు. ఈ రహదారి మీదుగా ఓడీచెరువు నుంచి కొండకమర్ల, నల్లమాడ, పుట్టప ర్తికి రోజూ పలు రకాల వాహనాలు వెళుతుంటాయి.
ఈ రోడ్డు మీదనే 716 నేషన ల్ హైవే నిర్మించారు. దీంతో కొండకమర్ల క్రాస్ వద్ద అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రారంభ దశలోనే దాదాపు 15 దాకా ప్రమాదాలు జరగడంతో భవిష్యత్తులో మరెన్నో ప్రమాదాలు జరిగే అవ కాశం ఉందని స్థానికులు, వాహనదారులు భయపడుతున్నారు. స్థానిక ప్రజల విన్నపం మేరకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ద్వారా రాష్ట్ర వినతిని అందజేయగా మంత్రి సానుకూలంగా స్పందింఛారు. ఆర్ అండ్ బి అధికారులను పిలిచి వెంటనే రోడ్డును పరిశీలించి తగిన ప్రతిపాధనలు పంపాలని సూచించారు. అలాగే తుమ్మల కుంట్లపల్లి పంచాయతీ ఎగువ చెర్లోపల్లి నుంచి నల్లచెరువు మండలం సుబ్బరాయనపల్లికి నూతనంగా తారు రోడ్డును నిర్మించాలని మరో వినతిని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ శెట్టివారి జయచంద్ర, నాయకులు ఆర్.శ్రీనివాసులునాయక్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....