GOD: కుంటెమ్మ దేవతకు బోనాలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:05 AM
ఖరీఫ్ సీజన లో వర్షాలు బాగా కురిసి, పం టలు బాగా పండాలని గ్రామ దేవత కుంటెమ్మను రైతులు వేడుకున్నారు. మండలపరిధి లోని పి. నాగిరెడ్డిపల్లిలో మం గళవారం గ్రామ దేవత కుంటె మ్మకు ఇంటింటి నుంచి అన్న దాతలు బోనాలు సమర్పించారు.
కూడేరు, జూన 9 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన లో వర్షాలు బాగా కురిసి, పం టలు బాగా పండాలని గ్రామ దేవత కుంటెమ్మను రైతులు వేడుకున్నారు. మండలపరిధి లోని పి. నాగిరెడ్డిపల్లిలో మం గళవారం గ్రామ దేవత కుంటె మ్మకు ఇంటింటి నుంచి అన్న దాతలు బోనాలు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చేగా దే వతగా పేరు గాంచిన కుంటె మ్మకు మూడేళ్లకోసారి రైతు లు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ మేరకు గ్రామంలోని ఇంటింటి నుంచి బోనాలతో ప్రజలు పెద్ద ఎత్తు న ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిం చారు. అదే విధంగా గ్రామంలోని చౌడమ్మ దేవతకు కూడా బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....