GOD: ఘనంగా భద్రావతి భావనారుషి కల్యాణం
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:08 AM
మండలకేంద్రంలోని భద్రావతి భావనారుషీశ్వరుల ఆలయంలో బుధవారం స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు.
యాడికి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని భద్రావతి భావనారుషీశ్వరుల ఆలయంలో బుధవారం స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గురుమూర్తి, అవ్వారు మల్లికార్జున, జానపాటి రాజు, కాలువ శ్రీనివాసులు, నాగరంగయ్య, పలువురు పద్మశాలీయులు పాల్గొన్నారు. అన్నదానం చేపట్టారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....