ROAD: బీటీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:55 PM
మండలంలోని చింతలపల్లి, వసంతపురం గ్రామాలకు వెళ్లే రహదారులు ఆధ్వానంగా తయారుకావడంతో కూటమి ప్రభుత్వం నూతన బీటీ రోడ్లుకు రూ. 2.6కోట్లు నిధులు మంజూరు చేసింది.
ధర్మవరం రూరల్, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలపల్లి, వసంతపురం గ్రామాలకు వెళ్లే రహదారులు ఆధ్వానంగా తయారుకావడంతో కూటమి ప్రభుత్వం నూతన బీటీ రోడ్లుకు రూ. 2.6కోట్లు నిధులు మంజూరు చేసింది. దీంతో బుధవారం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి మురళి, డీఈ పాండురంగారెడ్డి, టీడీపీ క్లస్టర్ ఇనచార్జ్ మహేష్‌చౌదరి వసంతపురం క్రాస్ వద్ద భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఆ గ్రామాల ప్రజలు నూతన రోడ్లు వేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీరాజ్ జేఈ వంశీకృష్ణ, నాయకులు విజయ సారథి, చక్కెరయ్య, నారా పురుషోత్తం, వలి, ప్రసాద్, నాగభూషణ, కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....