MLA: రైల్వే ఓవర్ బ్రిడ్జికి భూమి పూజ
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:20 AM
పట్టణ సమీపంలోని యల్లనూరు రహదారిలో శనివారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే అశ్మితరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే గేటు వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో రూ.49 కోట్ల వ్యయంతో ఆర్‌వోబీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
తాడిపత్రి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని యల్లనూరు రహదారిలో శనివారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే అశ్మితరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే గేటు వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో రూ.49 కోట్ల వ్యయంతో ఆర్‌వోబీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. పులివెందుల, సింహాద్రిపురం, యల్లనూరు తదితర ప్రాంతాల ప్రజలకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....