Share News

GOD: ఘనంగా భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:48 PM

పట్టణంలోని పెన్నానది ఒడ్డున వెలసి న భోగేశ్వరస్వామి పునఃప్రతి ష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠతో పాటు నూతన శిఖర ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద విని యోగం చేపట్టారు. మధ్యా హ్నం అన్నదానం నిర్వహించారు.

GOD: ఘనంగా భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ
Bhogeshwara Swamy in decoration

పామిడి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పెన్నానది ఒడ్డున వెలసి న భోగేశ్వరస్వామి పునఃప్రతి ష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠతో పాటు నూతన శిఖర ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద విని యోగం చేపట్టారు. మధ్యా హ్నం అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే గుమ్మ నూరు జయరాం, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడుయాదవ్‌, టీడీపీ మండల ఇనచార్జ్‌ గుమ్మనూరు ఈశ్వర్‌ హాజరై పూజలు చేయించారు.

ముగిసిన పాండురంగస్వామి ఉత్సవాలు

పామిడి పట్టణంలోని డబ్బిదార్‌ ఫిర్కా రుక్మిణి సమేత పాండురంగస్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. భావసార క్షత్రియులు రుక్మిణి సమేత పాండురంగస్వామికి విశేష పూజలు చేశారు. స్వా మి వారిని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, టీడీపీ మండల ఇనచార్జ్‌ గుమ్మనూరు ఈశ్వర్‌ దర్శించుకున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2026 | 11:48 PM