GOD: శ్రీరామనవమికి ముస్తాబైన ఆలయాలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:08 PM
శ్రీరామనవమి సందర్భం గా శుక్రవారం వేడుకలకు మండలంలోని రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కల్యాణో త్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను విద్యుత దీపాలతో ప్రత్యే కంగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు.
బొమ్మనహాళ్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి సందర్భం గా శుక్రవారం వేడుకలకు మండలంలోని రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కల్యాణో త్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను విద్యుత దీపాలతో ప్రత్యే కంగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. మండల కేంద్రంతో పాటు ఎల్బీనగర్, శ్రీధరఘట్ట, ఉద్ధేహాళ్, నేమకల్లు తదితర గ్రామాల్లో రామాలయాలు, ఆంజనే యస్వామి దేవాలయాలను ముస్తాబు చేశారు శుక్రవారం ఉదయం 11.54 గంటలకు అభిజిత లగ్నంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
రాయదుర్గం రూరల్: శ్రీరామనవమి వేడుకలకు మండ లంలోని 74 ఉడేగోళం, బీఎన హళ్లి, డీ. కొండాపురం, మల్లాపురం, మెచ్చిరి, చదం గొల్లలదొడ్డి, టీ వీరాపురం గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాలకు రంగులు వేసి, విద్యుత దీపాలతో అలంకరించారు. ఆలయాలలో సీతారామ కళ్యాణోత్సవం నిర్వహిస్తున్న ట్లు ఆలయకమిటీ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు. అనంతరం భక్తు లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....