CHANGE: మారనున్న బెళుగుప్ప పాఠశాల రూపురేఖలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:20 PM
పయ్యావుల సోదరుల చొరవతో మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల రూపురేఖలే మా రనున్నాయి. అంగనవాడీ నుంచి ఇంటర్ వరకు ఒకే చోట విద్యన భ్యసించేలా స్కూల్ ఆఫ్ ఎలక్షన్స పైలెట్ ప్రాజెక్టుగా స్థానిక ఉన్నత పాఠశాలను చేపట్టడానికి చర్యలు తీసుకోవడంతో గ్రామీణ విద్యార్థులకు అనుకూలంగా వుండ నుంది.
- కార్పొరేట్‌కు దీటుగా రూపకల్పనకు చర్యలు
బెళుగుప్ప, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : పయ్యావుల సోదరుల చొరవతో మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల రూపురేఖలే మా రనున్నాయి. అంగనవాడీ నుంచి ఇంటర్ వరకు ఒకే చోట విద్యన భ్యసించేలా స్కూల్ ఆఫ్ ఎలక్షన్స పైలెట్ ప్రాజెక్టుగా స్థానిక ఉన్నత పాఠశాలను చేపట్టడానికి చర్యలు తీసుకోవడంతో గ్రామీణ విద్యార్థులకు అనుకూలంగా వుండ నుంది. బస్సు సౌకర్యంతో పాటు హాస్టళ్లు నిర్మిం చనున్నారు. ప్రస్తుతం మండలంలోని గ్రామీణ విద్యార్థినులు ఉన్నత పా ఠశాలకు, ఇంటర్ చదువులకు వెళ్లలేక మధ్యలోనే చదువు మానే స్తున్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లడానికి అవకాశం లభిస్తుంది. హోస్టళ్ల ఏర్పాటుతో ఎర్రగుడి, నక్కలపల్లి ఆవులెన్న గ్రామాల విద్యా ర్థులకు అనుకూలంగా వుంటుంది. మంత్రి పయ్యావుల కేశవ్ జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని ప్రస్తుతం స్థానిక ఉన్నత పాఠశాలను స్కూలు ఆఫ్ ఎక్సలెన్సగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికకు చొరవ చూ పారని చేసినందుకు టీడీపీ నాయకులు పెద్దతిప్పయ్య, మల్లికార్జున, సింగిల్ విండో అధ్యక్షులు కంచిరాముడు, ఎస్‌ఎంసీ ఛైర్మన రుద్రయ్య, బాలాజీ, శివ పయ్యావుల సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. గ తంలో మంజూరైన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆటస్థలం కూడా అనుకూలంగా లేదు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....