Share News

BAR: బార్‌ అసోసియేషన ఎన్నికలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:00 AM

స్థానిక బార్‌ అసోసియేషన నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది శ్రీకాంత రెడ్డి ఎన్నికయ్యా రు. పట్టణంలోని బార్‌ అసోసియేషన కార్యాలయంలో సోమవారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి శ్రీకాంత రెడ్డి, మనోహర్‌ బాబు పోటీ పడ్డారు.

BAR: బార్‌ అసోసియేషన ఎన్నికలు
Lawyers with new office in the bunch

గుత్తి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): స్థానిక బార్‌ అసోసియేషన నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది శ్రీకాంత రెడ్డి ఎన్నికయ్యా రు. పట్టణంలోని బార్‌ అసోసియేషన కార్యాలయంలో సోమవారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి శ్రీకాంత రెడ్డి, మనోహర్‌ బాబు పోటీ పడ్డారు. మొత్తం 97ఓట్లు ఉండగా, శ్రీకాంత రెడ్డికి 57 ఓట్లు, మనోహర్‌ బాబుకు 33 ఓట్లు వచ్చాయి. 24ఓట్ల తేడాతో శ్రీ కాంత రెడ్డి గెలుపొంది, అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జాకీర్‌ హుసేన ప్రకటించారు. మిగతా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రామ్మోహన రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నగదాని చంద్రశేఖర్‌, కార్యదర్శిగా నవీన, కోశాధికారిగా రోజారమణి, స్పోర్ట్స్‌ సెక్రెటరీగా తాలప్ప, మహిళా ప్రతినిధిగా రమా దేవి, సభ్యులుగా తిమ్మారెడ్డి, నూరుమహమ్మద్‌, హనుమంతరెడ్డి, ధనుంజయ, సోమశేఖర్‌, పీడీ రత్నం, నరసింహ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీకాంత రెడ్డిని న్యాయవాదులు ఘనంగా సన్మానించి, అభినందించారు.

కణేకలు: మండల కేంద్రానికి చెందిన న్యాయవాది కణేకల్లు హనుమంతరెడ్డి సోమవారం జరిగిన రాయద్గుం బార్‌ అసోసియేషన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సోమవారం రాయదుర్గం పట్టంలో బార్‌ అసోసియేషన ఎన్నికలు జరుగగా హనుమంతరెడ్డి 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా తోటి న్యాయవా దు లు ఆయనకు పూలమాలలు, శాలువలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా హనుమంతరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం వృత్తి అభివృద్ధి మరియు బార్‌ అసోషియేషనకు కట్టుబడి పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 31 , 2026 | 12:00 AM