MAGISTRATE: చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:49 PM
విద్యార్థులు చదు వుతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని గుంతకల్లు జ్యుడి షియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు న్యాయాధికారి జి. మంజుల పేర్కొన్నారు. స్ధాని క ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం లీగల్ లిటరసీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
- న్యాయాధికారి మంజుల
గుంతకల్లు టౌన, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదు వుతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని గుంతకల్లు జ్యుడి షియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు న్యాయాధికారి జి. మంజుల పేర్కొన్నారు. స్ధాని క ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం లీగల్ లిటరసీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయాధికారి మాట్లాడుతూ... ఏవైనా చట్టపరమైన సమస్యలు వస్తే లీగల్‌గా ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలపై వివరించారు. న్యాయ వాదులు బీఎస్ కృష్ణారెడ్డి, నాగరాజు మాట్లాడుతూ చట్టానికి లోబడి జీ వనాన్ని కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ రవిశంకర్ శర్మ, ఆధ్యాప కులు జమీలబీబీ, వాణి, గోపినాయక్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....