Share News

MINISTER: టీడీపీ హయాంలోనే మహిళల్లో చైతన్యం

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:53 PM

టీడీపీ హయాంలోనే మహిళల్లో చైతన్యం వచ్చిందని, డ్వాకా సంఘాలు దేశానికే స్ఫూర్తిదాయ కమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని మండల పరిషత కార్యాలయ ఆవరణంలో బుధవారం వె లుగు ప్రాజెక్ట్‌లోని 200 మంది వీవోఏలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు.

MINISTER: టీడీపీ హయాంలోనే మహిళల్లో చైతన్యం
Minister distributing cellphones to VOAs

- మంత్రి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): టీడీపీ హయాంలోనే మహిళల్లో చైతన్యం వచ్చిందని, డ్వాకా సంఘాలు దేశానికే స్ఫూర్తిదాయ కమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని మండల పరిషత కార్యాలయ ఆవరణంలో బుధవారం వె లుగు ప్రాజెక్ట్‌లోని 200 మంది వీవోఏలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి, డ్వాక్రా సంఘాలకు అనుసంఽ దాన కర్తలు వీవోఏలు అన్నారు. మహిళా సంఘాలు పొదుపు చేసిన డబ్బులు సెర్ఫ్‌లో రూ.20 వేల కోట్లు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వానికి ఇవి కనిపించి ఉంటే మాయం అయ్యేవని విమర్శించారు. మహిళా సంఘాల ఏర్పాటుకు ఆద్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబునే అన్నారు. తన గెలుపులో మహిళలు ఎంతో కీలకపాత్ర వహించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. మహిళ సంఘాల్లోని సభ్యు ల ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానన్నారు. గార్మెంట్‌ పరిశ్రమను తెప్పిస్తామమన్నారు. అలాగే పట్టణంలో నూత నంగా నిర్మించిన అన్న క్యాంటీనను, స్థానిక చెరువు అభివృద్ధి పనులను, కణేకల్లు క్రాస్‌ నుంచి గుంతకల్లు రోడ్డులో వరకు నాబార్డు నిధుల కింద రూ.3కోట్లతో నిర్మించిన రహదారిని పరిశీలించారు. కల్వర్టు వెడల్పు, డ్రైనేజీకి సంబంధంచి రోడ్లు, భవనాల అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ దేవినేని పురుషోత్తం, ఏఎంసీ చైర్మన విజయ్‌భాస్కర్‌, పీఏసీ చైర్మన ప్యారం కేశవానంద, డీఆర్‌డీఏ పీడీ శైలజ, రోడ్లు, భవనాల శాఖ ఈఈ రాజ్‌గోపల్‌, డీఈ బాలకోట య్య, ఏఈ నాగభూషణం, ఎంపీడీవో రవి ప్రసాద్‌, టీడీపీ నాయకులు, రామాంజినేయులు, లాయర్‌ శ్రీన, డీకే ప్రసాద్‌, తిమ్మప్ప, యర్రగుంట్ల వెంకటేష్‌, గోవిందు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 08 , 2026 | 11:53 PM