OCCUPY: ప్రభుత్వ స్థల ఆక్రమణకు యత్నం
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:38 PM
పట్టణంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వం మారినా ఆక్రమణ లకు అడ్డుకట్ట పడడం లేదు. వాటికి రక్షణ కల్పించాల్సిన అధికారులు మిన్నకుండపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజా ప్రతినిఽ దుల పేర్లు చెప్పి అధికార పార్టీ నాయకులు కబ్జాల పర్వం మొదల పెట్టారు.
- పునాదుల కోసం గుంతలు తవ్విన వైనం
గుంతకల్లుటౌన, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వం మారినా ఆక్రమణ లకు అడ్డుకట్ట పడడం లేదు. వాటికి రక్షణ కల్పించాల్సిన అధికారులు మిన్నకుండపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజా ప్రతినిఽ దుల పేర్లు చెప్పి అధికార పార్టీ నాయకులు కబ్జాల పర్వం మొదల పెట్టారు. ప్రభుత్వ స్థలంలో పార్క్‌కోసం వదిలిన స్థలం కబ్జాకు పాల్ప డుతున్నారు. పట్టణంలోని దోనిముక్కల రోడ్డులో గతంలో కాంగ్రెస్ ప్ర భుత్వం హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తరువాత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్‌లు వేసి తిరిగి ఇంటిస్థలాలు కేటాయించారు. అందులో ప్రభుత్వం సర్వే నంబరు 48-బీ, లేఅవుట్ నంబరు-1లో మిగులు భూమి 20 సెంట్లు ఉన్నాయి. రెవెన్యూ అధికా రులు పార్క్ కోసం ఆ స్థలం వదిలారు. ఆ విలువైన స్థలం మీద అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఆ స్థలాన్ని కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు పునాదులు తవ్వారు. పునాదులు వేసేందుకు రాళ్లను తరలించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం - రమాదేవి, తహసీల్దార్
ప్రభుత్వ సరే ్వ నెంబరు 48-బీ, లేఅవుట్ నెంబరు-1లో మిగులు భూమి 20 సెంట్లుఉంది. వీఆర్వో ద్వారా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి, హద్దులు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ స్థలం కబ్జాకు ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకుంటాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....