Share News

MINISTER: అట్టహాసంగా మంత్రి కేశవ్‌ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - May 14 , 2026 | 11:46 PM

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు గురువారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. అంతకు మునుపు మండల పరి షత కార్యాలయం నుంచి టవర్‌క్లాక్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిం చారు.

MINISTER: అట్టహాసంగా మంత్రి కేశవ్‌ జన్మదిన వేడుకలు
TDP leaders giving incentives to class 10 students

ఉరవకొండ, మే 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు గురువారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. అంతకు మునుపు మండల పరి షత కార్యాలయం నుంచి టవర్‌క్లాక్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిం చారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులకు టవర్‌ క్లాక్‌ కూడ లిలో నగదు ప్రోత్సాహ కాలను అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన నక్షత్రకు రూ.10 వేలు, మిగిలిన 15 మంది విద్యార్థులకు రూ.5వేలు చొప్పున నగదు అందజేశారు. మంత్రి 61వ పుట్టిన రోజును పురస్కరించుకుని 61 కేజీల కేకును కట్‌ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐడీసీ మాజీ డైరెక్టర్‌ దేవినేని పురుషోత్తం, పెన్నహోబిలం ఆల య కమిటీ చైర్మన రేగాటి నాగరాజు, ఏఎంసీ చైర్మన విజయ్‌భాస్కర్‌, పీఏ సీఎస్‌ చైర్మన ప్యారం కేశవానంద, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్‌ చైర్మన తిమ్మప్ప. పార్లమెంట్‌ కార్యదర్శి దేవకీ దేవి, టీడీపీ పట్టణ కన్వీనర్‌ రామాంజినేయులు, మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, మాజీ జడ్పీటీసీ గుర్రం సుధాకర్‌, నాయకులు నెట్టెం రాంబాబు, డీకే ప్రసాద్‌, గోవిందు, వెంకటేష్‌, నెట్టెం బోసు, గొర్తి రంగనాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 14 , 2026 | 11:46 PM