Share News

CROP: పచ్చని పైరుతో కళకళ

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:09 AM

మండలంలోని బీటీపీ ఎడ మకాలువ కింద ఆయకట్టు భూముల్లో వరి పంట పచ్చగా కళకళ లాడుతోంది. ఆరేళ్ల క్రితం కంపచెట్లు పెరిగి బీటలువారిన బీడు భూ ముల్లో నేడు పచ్చని వరిపైరు కనువిందు చేస్తోంది. కరువు ప్రాంతంగా పేరుపడ్డ కలుగోడు గ్రా మం నేడు కోనసామను తలపిస్తుండడంతో రైతు ల కళ్లల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.

CROP: పచ్చని పైరుతో కళకళ
Paddy grown under the auspices of BTP

-బీటీపీ ఆయకట్టు రైతుల్లో ఆనందం

గుమ్మఘట్ట, మార్చి 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని బీటీపీ ఎడ మకాలువ కింద ఆయకట్టు భూముల్లో వరి పంట పచ్చగా కళకళ లాడుతోంది. ఆరేళ్ల క్రితం కంపచెట్లు పెరిగి బీటలువారిన బీడు భూ ముల్లో నేడు పచ్చని వరిపైరు కనువిందు చేస్తోంది. కరువు ప్రాంతంగా పేరుపడ్డ కలుగోడు గ్రా మం నేడు కోనసామను తలపిస్తుండడంతో రైతు ల కళ్లల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఆయకట్టు కింద దాదాపు ఐదు వేల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. పొలాలన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయి. గతంలో ఉపాధి కోసం కర్ణాటక ప్రాం తాలకు వలస వెళ్లిన రైతు కుటుంబాలు ఆయకట్టుకు సాగునీరు రా వడంతో గ్రామాలకు చేరుకుని పంటలు సాగు చేస్తున్నారు. భవిష్యత్తు లో బీటీపీ రిజర్వాయర్‌కు హంద్రీనీవా జలాలు చేరితే ఇక్కడి ఆయక ట్టు భూముల్లో బంగారు పంటలు పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వరుణదేవుడు కరుణించడంతో బీటీపీలో పూర్తిస్థాయి వరదనీరు చేరింది. కుడి, ఎడమ కాలువల కింద బ్రహ్మ సముద్రం, గుమ్మఘట్ట మండలాల్లో దాదాపు ఆరువేల ఎకరాల్లో పం టలు సాగవుతున్నాయి. దీంతో పాటు బోరుబావుల్లో పుష్కలంగా భూ గర్భజలాలు పెరగడంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 15 , 2026 | 12:09 AM