CRISIS: ఆర్నెల్లుగా నీటికి కష్టాలు
ABN , Publish Date - May 09 , 2026 | 11:12 PM
కంబదూరు మండల కేంద్రంలో కన్నీటి కష్టా లు రోజురోజుకీ అధికమవుతున్నాయి. ఆర్నెల్లు గా బిందెడు నీటి కోసం ప్రజలు నానా తం టాలు పడుతున్నారు. ఇక గత్యంతరం లేక ట్యాంకర్లను పెట్టి నీటిని కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. లోతట్టు ప్రాంతాలకు బిం దెడు నీరు దొరకాలంటే ఎన్ని రోజులు పడు తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు.
- ఎవరూ పట్టించుకోవడం లేదని కంబదూరు వాసుల ఆవేదన
కళ్యాణదుర్గం, మే9(ఆంధ్రజ్యోతి): కంబదూరు మండల కేంద్రంలో కన్నీటి కష్టా లు రోజురోజుకీ అధికమవుతున్నాయి. ఆర్నెల్లు గా బిందెడు నీటి కోసం ప్రజలు నానా తం టాలు పడుతున్నారు. ఇక గత్యంతరం లేక ట్యాంకర్లను పెట్టి నీటిని కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. లోతట్టు ప్రాంతాలకు బిం దెడు నీరు దొరకాలంటే ఎన్ని రోజులు పడు తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రంలోని మారెమ్మ కాలనీలో పరిస్థితి మ రీ దారుణంగా ఉంది. దీంతో ఆ కాలనీ వా సులు ట్యాంకర్ నీటిని రూ. 650 పెట్టి కొంటున్నారు. ఈ కాలనీతో పాటు పాత ఎస్సీ కాలనీ, బ్రాహ్మణ వీధి, ఆర్డీటీ కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. మండల కేంద్రానికి శ్రీరామిరెడ్డి, సత్య సాయి తాగునీటి పథకాల నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. మండల కేంద్రంలో ఉన్న బోర్లల్లో వచ్చే నీటి మీద మాత్రమే ఆధారప డాల్సి వస్తోంది. ఆ నీరు మండలకేంద్రాని కంతా ఎక్కడా సరిపోవడం లేదు. దీంతో పాటు తరుచూ మోటార్లు మరమ్మతులకు రావడంతోనే నీటి ఎద్దడి అధికం అవుతోంది. సుమారు ఏడు వేల పైబడి జనాభా ఉన్న మండల కేంద్రంలోనే కన్నీటి కష్టాలు వర్ణణా తీతంగా మారాయి.
ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవ డంతో సమస్య తీవ్రతరం అవుతోందని ప్రజలు వాపోతు న్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా, ఖాళీ బిందెలతో నిరసన తెలిపినా సమస్యను పట్టించుకునే నాథుడే కరువై పోయారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు స్పందించి కంబదూరు వాసులకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని మండలకేంద్రం ప్రజలు కోరుతున్నారు.
- ఈ విషయమై ఎంపీడీవో సూర్యనారా యణను వివరణ కోరగా త్వరలోనే అన్ని కాలనీ ల్లోను నీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరి స్తామని తెలిపారు. శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగు నీటి పథకాల నీరు సక్రమంగా సరఫ రాపోవ డంతోనే అన్ని కాలనీలకు సక్రమంగా నీరు అందించ చేయలేకపోతు న్నామని అన్నారు. ఇక నుంచి ఆ సమస్య లేకుండా పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....